![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -435 లో....కాంచన డల్ గా ఉంటుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు. పెళ్లికి ఒప్పుకున్నారు కరెక్టే కానీ పెళ్లి గురించి వెళ్లి ఎలా మాట్లాడాలని కాంచన అంటుంది. అప్పుడే దశరథ్ వస్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ, పారిజాతం, సుమిత్ర ఇలా ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తారు. పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చామని శివన్నారాయణ అనగానే.. ఇప్పుడే కాంచన దాని గురించి మాట్లాడుతుంది. ఇంతలో మీరే వచ్చారని అనసూయ అంటుంది.
మీరు ఇబ్బంది పడుతారని మేమే వచ్చామని దశరథ్ అంటాడు. కాంచనతో సుమిత్ర ప్రేమగా మాట్లాడుతుంది. దీప నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని సుమిత్ర అనగానే మా అమ్మ నాతో మాట్లాడింది కోపం పోయిందని దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం ఇలా పక్కకు వెళ్లి మాట్లాడుకుందామని కాంచనని తీసుకొని పక్కకి వస్తుంది సుమిత్ర. వదిన నువ్వు దీపని క్షమించి ఈ పెళ్లికి ఒప్పుకున్నావని కాంచన అంటుంది. అదంతా నటన నేను దీపని క్షమించడం అసలు జరగదని సుమిత్ర అంటుంటే.. కాంచన షాక్ అవుతుంది.
ఈ పెళ్లి జరగదు.. నువ్వు వెళ్లి వాళ్ళ చేతుల మీదగా పెళ్లి అవసరం లేదు.. ఏదో చిన్నగా చేసుకోండి అని చెప్పమని కాంచనతో సుమిత్ర అంటుంది. నా కోడలిని క్షమించు ఈ పెళ్లికి ఒప్పుకోమని కాంచన రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు చెప్పకపోతే నేనే చెప్తానని సుమిత్ర వెళ్తుంటే జ్యోత్స్న వచ్చి ఈ పెళ్లి జరుగుతుందని చెప్తుంది. మమ్మీ తాతయ్య మన కోసం మాటిచ్చాడు.. నాకు లైఫ్ లాంగ్ రిగ్రేట్ ఉంటుంది కదా ప్లీజ్ ఒప్పుకోమని జ్యోత్స్న అనగానే సుమిత్ర సరే అంటుంది. అందరు గదిలో నుండి హాల్లోకి వస్తారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అమ్మని అడగాలని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |